60 యేళ్ళ బుక్కు కథ,…… దీని భావమేమి తిరుమలేశా

60 సంవత్సరాల నాటి మాట, మన పెద్దోల్లు తెల్ల పోరగాల్ల బతుకు మనకొద్దు, మనం కూడా మనకు ఒక బుక్కు రాసుకోని, అందులో రాసిన విధంగా బతుకుదాం అని అనుకొన్నారు. అంటే, ఆల్రెడీ జరిగినవి రాస్తే కథ అవుతుంది, జరగనివి రాసి అవి జరిగేలా చెస్తే. కాన్స్టిట్యూషన్  అవుతుంది, అని దీనర్థం. తిక్క నాయాల్లు( ప్రేమతో అన్నా కాబట్టి ఇది బూతు కాదు). అలా అనుకొని రెండు సంవత్సరాలు ఇరగదీసి ఒక 90000 పదాల్ని అతి జాగ్రత్త గా కూర్చి, తాంబూలాలిచ్చాం  తన్నుకు చావండి అని మన మీదకు వదిలారు. దీనికి సాక్షులు అలనాటి 271 నియోజకవర్గ పాలకులు. వాల్లందరు తల ఊపి కొంతమంది సంతకాలు కొంతమంది వేలి ముద్రలు వెసాక మన ప్రప్రథమ రాష్ట్ర పతి బాబు రాజెంద్ర ప్రసాద్ గారు కూడా తల ఊపి ఒక సంతకం పెట్టి రాజ ముద్ర వేసారు. దీని తస్సదియ్య , ఇగ సుభం కార్డు వెయ్యొచ్చనుకొంటె, అక్కడక్కడా కొన్ని సవరింపులు చెయదల్చి మన పెద్దొల్లు ఎడిటింగులు చేయబట్రి, (సరిగ్గ చూసుంటె మొత్తం తప్పులే అగుపడేవేమో), ఇప్పటికి 60 సంవత్సరాల పుణ్యకాలం హారతి కర్పూరం అయిపోయె, మధ్యలో మూడొచ్చినప్పుడల్లా చెసిన ఎడిటింగులు మొత్తం 94 అయ్యి కుర్చున్నాయి. దీని సిగ దరగ సంవత్సరాల కన్నా మార్పులు చేర్పులు ఎక్కువైపొయినాయి. అవ్విధమున ముస్లిం సహోదరులకు ఒక ఖురాన్ లాగ, క్రైస్తవులకు(వీల్లు కూడా మన సహోదరులే) బైబిల్ లాగా, హిందువులకు  గీత లాగా, ఇగ మిగతా అన్ని సహొదరులకు వారి వారి పున్య గ్రంధాల లాగా, (గమనిక: ఇక్కడ సోదరీమనులను తెలియబర్చక పోవడానికి ఒక కారణం ఉన్నది, నాకు చిన్నప్పటి నుండి మొహం చూసి సోదరి గా సంభొదించాలో వద్దో డిసైడ్ అవ్వడం అలవాటయ్యింది, అందువల్ల సమయాభావం అయినట్టు తెలీయపరుస్తున్నాను, ఈ విషయమందు అన్యధా భావించ కూడదని ప్రార్థన, ఇందులో మీక్కావలసినన్ని శ్లేషార్థములు దొరుకుతాయి). సో ఆవిధముగా మన పున్య పురుషులు అండ్ స్త్రీ లు మన బతుకులు మారుతాయనె సదుద్దేశ్యం తొ రచించిన ఆ పుస్తకం లో అయితే మార్పులు చేర్పులు జరిగాయి గాని, ఎకార్డింగ్ టు మై నాలెడ్జి, మన బతుకులు స్టిల్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడె అన్న చందాన మన పాలకుల కళ్ళకు అగుపడక ఎదుగు బొదుగు లేక సంక ___ పోతున్నాయని నా ఉద్దెశ్యం. భారత దేశం వెలిగి పోతోంది అని ఊదర గొడుతున్న నాయకులకు ఆ వెలుగుల వెనుక ఉన్న చీకట్లు గాని, ఆ వెలుగులకు, వెలుగులు కాని జిలుగులకు కారణ భూతమైన రైతన్నల చావు దృశ్యాలు, నాబోటి వారి ఆకలి కేకలు కనపడలేదా. అసలు ఆ వెలుగులన్ని సామాన్యుని గుండె మంటల ఆనవాల్లేనా అని నాకనుమానం.

ఇక మనం గొంతు చించుకొని అరిచే డెమొక్రసి ని నేను కొన్ని ప్రశ్నలు అడుగ దల్చాను.
1. అయిదు సంవత్సరాల కొకసారి జరిగె ఎన్నికల్లొ ముప్పాతిక భాగం నియోజక వర్గాల్లో పోలైన వోట్లు 30-40% మాత్రమె ఉంటున్నాయి, మిగతావాల్లకు ఈ వ్యవస్థ(ప్రజాస్వామ్యం) మీద నమ్మకం లేదా ?.
2. దేశాన్ని ఏలడానికి నేరస్థులు తప్ప ఇంకెవరూ దొరకలేదా?
3. వాక్స్వాతంత్రపు హక్కునిచ్చిన ప్రభుత్వం, ఏలికల నిస్సిగ్గు తొ కూడిన కీచక పర్వాలను సమాజానికి భహిర్గతం చేసినపుడు న్యాయస్థానం రూపం లో నిజం నాడిని ఎందుకు నొక్కింది(తివారి పర్వం)?.
4. కుల మత వర్గ ప్రాంత విభెదాలు లేకుండా అందరిని సమానంగా చూడలన్న బుక్కు(60 ఇయర్స్ ఒల్డ్), ప్రజల స్తితి గతులను తేల్చడానికి అవే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఎందుకు ప్రాతిపదికగా తీసుకొంటొంది (దయచేసి వ్యక్తిగతంగా ఈ వ్యాఖను తీసుకొవద్దు).
5. వాల్లు రాసిన బుక్కు మన బతుకుల్లొ తెచ్చిన మార్పుని 60 సంవత్సరాల నుండి ఇప్పటి దాకా లెక్క వేస్తె ఇంకెన్ని సంవత్సరాలు/యుగాలు కావాలి?.

అదీ అలా అడుగు అని చంకలు గుద్దుకోకండి, కింద ఉన్న ప్రస్నావళి పుజ్యులైన గౌరవ భారతీయులమైన మనకు (మీకు +నాకు).
1. 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 రొజులు కూడా కాకనే 100 కోట్లు గ్రాస్ రాబడుతున్నాం, బీద అరుపులు అరిచే మనకు ఇదెలా సాధ్యం?.
2. రెండు మూడు గంటలు క్రికెట్ ఆడి నందుకు వందల కోట్లు చేతులు మారుతున్నాయి, దీనికి కారణం వీరభక్తులమైన మనం వెర్రి ముదిరినట్టు సమయం తో పాటు సర్వం క్రికెటార్పణం చెయ్యడమెనా?
3. పనెగ్గొట్టడానికి అయిన్ స్టీన్ లెవల్లొ ఆలోచించే మనం ఓటు వెయ్యాలంటె ఎందుకేడుస్తాం?
4. ఒకరి బాగు ఒకరు కోరాల్సిన మనం ఎందుకు మా భాష, మా రాష్ట్రం, మా కులం, మా ప్రాంతం, అని కొట్టుకు చస్తాం.
5. ఒక పక్క జి డి పి పెంచాలని ఆ తలపాగాయనా, పంచెకట్టాయన తల బాదుకొంటుంటె , బస్సులు తగులబెట్టి, నాన హంగామ చేసి అందర్ని ఎందుకు హడలు గొడుతున్నాం, మనమెమీ కిష్కిందకు వెల్లి నాశనం చేయట్లేదే?
6. దేశ భక్తి పేరుతో ఎందుకు ఆత్మార్పణం చేసుకొని కన్న వాళ్ళకు గుండె కాల్చి ఉన్న ఊరికి మంటపెడుతున్నాం, స్వాతంత్య్ర పోరాటం లో ఎంతమంది వీరులు పోరాటం జరుపకుండా ఆత్మ హత్యలు చేసుకొన్నారు, మరి మనది దేశ భక్తా అలా చెప్పబడిన పిరికితనమా ?.

టైం దొరికినప్పుడు తీరిగ్గా పై వాటికి సమాధానం వెతుక్కోండి..

ఇక ప్రస్తుతానికి సెలవు తీసుకొంటూ

రాజు.

అవలోకనం


ఇంకో కొన్ని రోజుల్లో రాబోతున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు చెప్పుకుందామా.  స్వాగతించే  ముందుగా  గతించిన  ఈ ఏడు  గుర్చీ కొద్దిగా ముచ్చటించుకుందాం. ఎప్పటిలాగానే, ఈ సంవత్సరం కూడా తీపి చేదుల కలయికల గుళికె అయ్యింది . విషయానికి  వస్తే  తో అనుమానాలు , గుజరాత్  ఎన్నికలప్రతికూల  ఫలితాలు వెరసి  ఒక సంవత్సర  కాలపు అధికారం  ఏదో గడిచింది అన్నట్టుగా  గడిపేసింది  మాన్యశ్రీ కేంద్ర ప్రబుత్వం. ఇక రాష్ట్ర విషయానికి వస్తే దేవుని పాలన లో రాష్ట్రం వద్దు వద్దు అన్నా సాస్య శ్యామలంగా పరిడవిల్లుతోంది,  ఈ క్లుప్త  సమాచారంతో మన రాజకీయ చర్చను  అలా పక్కన పెట్టి, సామాన్యుడు అంటే మనబొటి వాడు గూర్చి స్టార్ట్ చేద్దామా,  ప్రపంచ పటం లో  మన  దేశం వెలిగి పోతోంది. నిజం ఒక్కసారి బీద ఎడ్పులు ఏడ్చే కులీ, మధ్యవర్గపు, సామాన్య జీవితపు బడుగు వర్గపు విలువ లేని చూపులు  వదిలి  ఖరీదైన నిఖర్‌సైనా సో కాల్డ్ ధనిక ప్రపంచపు ఖరీదైన చూపులతో చూడండి, భారత్ వెలిగి పోతోంది అని రొమ్ములు పగలు గొట్టుకొని అరిచి గీ పెట్టి  చెప్తున్నాయి, కనబడలేదా, అయితే మీరు కూడా నాలాగే  సామాన్య జీవితానికి అలవాటు పది అబద్దమాడినట్టే లెక్క. బక్కటేముకల పిచ్చి రైతన్న  గూర్చా వదిలెయ్యండి  పనికి మాలిన వ్యవహారం, ఆత్మ హత్య చేసుకుంటాడ వాడి ఖర్మ, ఎక్ష్‌గ్రేసియా ప్రకటించి ఇచి ఇవ్వకుండా వాడి  కుటుంబాన్ని కూడా ఛంపుడాం, తీసుకోవడానికి ఎవరు లేకుండా. ఇక కులీ, కార్మిక వర్గాల బ్లడీ లోవర్ అండ్ మిడ్ల్ క్లాస్ గ్రూప్స్ వదిలెయ్యండి. సంస్కృతులు సాంప్రదాయాలు ,విలువలు ఎక్సెత్రా , ఇదిగో ఇంకో  సమాధానం ”ఏమిటి ఈ పాత చింతకాయ పచ్చడి” . ఏమిట్రా నీ భాద అని  నన్ను కమ్యూనిస్ట్ గా ఊహించుకుంటే పొరబడినట్టే. ఇదంతా సామాన్య భారతీయుని గోడు, వాడి తరపున వకాల్తా పుచ్చుకొని  నేను ఇలా  వెళ్లబోసుకుంటున్నా.  నిష్టురమాద్దం తప్ప ఏమీ చేయలేని జీవితాలు ఇవి. తేరుకువగా ఉంది వారిని ఉత్తేజ పర్చి వారిని చేరదీసి దారి  చూపి వారి  బతుకుల బాగు కోసం ఉద్యమించాల్సిన సో కాల్డ్ నాయకులు పెద్దలు వారి వాక్కు స్టేజ్ లకు, తూతూ మంత్రంగా చేసే ఆమరణ నిరాహార దీక్షలు  గంటలకు పరిమితం అయ్యీ ఎక్కడ వేసిన గొంగాలీ అక్కడే చందాన మార్పులు చేర్పులు లేకుండా ఇలా గడిచిపోతున్నాయి ఇవ్వ్వాల ఈ అసమర్థుల జీవితాలు. మనక్కావాల్సింది హామీలు కాదు, ఖండింపులు, తీవ్రమైన ఖండింపులు కాదు, సానుభూతి అసలే కాదు, కడుపు కు ఇంత కూడు పెట్టె చేయి. ఇప్పటి కాలంలో ఆది గగానం అయిపోతోంది. ఇలా అని నేను మొత్తం అందరినీ దుమ్మెత్తిపొస్తున్నానని అనుకుంటే మళ్లీ పొరబడ్డారు. మంచి వాళ్ళు అసలే లేరు అని కాదు, మంచి వాళ్ళు:చెడ్డావాళ్ళు తేడా ఎక్కువైంది అంతే.

కన్నీటి వెనుక కథ

” నవ్వినా ఎడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీటి వెనుక ఏమున్నదో తెలుసునా” పాత పాటల్లొ ఒక ఆనిముత్యం ఇది. ఇప్పుడు దాని సందర్భం ఎమిటంటారా… తొందరెందుకు చెప్తున్నా…. ఈ మధ్య గుజరాత్ ఎన్నికలలొ మోడిత్వ అంటూ కాంగ్రెస్ ని ఓడించిన మోడి గారి గూర్చె నేను భ్లాగబోయెది. విషయం చెప్పకుండా నాంచుతావెంట్రా అని మీరు కర్ర అందుకునె లోపు ఇదిగొ ఇక్కడ మొదలు పెడుతున్నా. గెలిచిన ఆనందంలొ మన హీరొ( సూచిక(అభ్యంతరం ఉన్న వారికి ) :గెలిచాడు కాబట్టి ప్రస్తుతానికి అలానె పిలుద్దాం) అదెనండి మోడి తన పార్టీ కార్యవర్గ సమావేశంలొ ఉంటె, సరిగ్గా అదె సమయంలొ ఎవరో మోడి బిజెపి లొ పెరుగుతున్న పెద్దతలకాయ అన్నారంట. దానికి నొచ్చుకున్న హీరో( ఎవరొ తెలుసు కదా) వెంటనె కల్ల నిండా నీళ్ళు పెట్టుకున్నాడంట. గోద్రా లో అంత మంది చచ్చినా, మత సంఘర్షణ లు చెలరేగి రాష్ట్రమంతా అట్టుడికిపొతున్నా ఏడవని మోడిని ఏడ్పించెసారు, పనిలో పనిగా ఈ ఏడుపుతొ మన హీరో ఇంకా సానుభూతి సంపాదించుకున్నాడు. అటు గుజరాత్ లొ గెలిచి మద్యంతరం వైపు దూసుకుపొదాం అనుకున్నా, ఇటు రూమర్స్ తో ఏడ్పిద్దామనుకున్నా రెండూ దెబ్బతీసి కంగ్రెస్ ని ఇరకాటం లొ పెట్టెసాయి. దీన్ని బట్టి చూస్తె ఇప్పట్లొ కాంగ్రెస్ మధ్యంతరం వైపు కన్నెత్తి చూసెలా లెదు. మరి ఇక్కడ సశేషం ఏమిటంటే. గోద్రా లో అంత మంది చచ్చినా, మత సంఘర్షణ లు చెలరేగి రాష్ట్రమంతా అట్టుడికిపొతున్నా ఏడవని మోడి ఇంత చిన్న మాట కి ఎందుకు ఎగ్సైట్  అయ్యాడబ్బా…….? ఆయన ధుఖసాగరం వెనుక భావమెమిటి అని.                            

పుస్తకం తొ నా పరిచయం

ఇవ్వాలెందుకో గాని బ్లాగాలని మనసు ఒకటె లాగుడు, సరె ఇక ఆగడమెందుకు అని బ్రౌసెర్ ఒపెన్ చేసాను. ఇక్కడె వచ్చింది అసలు చిక్కు,బ్లాగడం అన్నది ఎంతొ ఓపిక తొ కూడుకున్న వ్యవహారం అని తెలిసొచ్చింది, మధ్యలొ ఈ విసుగుడు పర్వం ఏంటి మహశయా అంటె, ఇదిగొ నా సమాధానం.ఇవ్వాళ నెను చెప్ప బొయెది యండమూరి గారి “విజయానికి ఆరొ మెట్టు” గుర్చి ( మిగిలిన అయిదు మెట్లు చదివిన ఫలం గుర్చి ఆరా తీస్తె నెను నోరు వెల్ల బెట్టడం తప్ప ఎమి చెయ్యలెను). ఈ పుస్థకం ఆసాంతం చదివిన వారికి దాని గుర్చి బ్లాగాలంటె ఈ మాత్రం ముందస్తుగ కొద్దిగ ధైర్యం మరియు అంతొ ఇంతొ మన భాధ ని చెప్పుకొవాలి కద.
విషయానికొస్తె, రోజు మొత్తం కంప్యూటర్స్ తొ సహవాసం చెసె నెను ఈ యాంత్రిక జీవితపు తాంత్రిక మహత్తు( ప్రాస బాగా కలిసింది కదా( నా బొటి వాల్లకు ప్రొత్సాహం అందిస్తె మీ సొమ్ము ఎమీ పొదు సుమీ, ఆ మాత్రం అశ్యూరెన్స్ ఇవ్వడానికి నెను రెడి).ఆ తాంత్రిక మహత్తు నుండి బయట పడి పుస్తకాలు తీస్తె, ఈ పుస్తకం అగుపించింది. కవరు పేజి లొ మన యందమూరి గారు నిమ్మళంగ కూర్చొని వున్నారు, ఎమిటో ఈయనగారి ఆరొ మెట్టు అని ఒపెన్ చెశాను. భగవద్గీతకు సరి కొత్త భాష్యం అని కనిపించింది. పుస్తకం చూస్తె విధ్యార్తులకు అన్నాడు, మరి వారికి భగవద్గీత చదివె ఒపిక ఉంతుంద అని క్షన కాలం పాటు ఆవెసించి ఆలొచించి మల్లి తిరిగి నా లుక్కులను బుక్కులొనికి కుక్కాను(మల్లి ప్రాస గొడవ కదా). కాని అంథర్ముఖం నవల చదివిన అనుభవం తొ నా యత్నం కొన”సాగించడానికె” వొటు వెసా.కాని మనసులొ ఎదొ ఒక మూల చిన్న సందెహం, ఇప్పుదున్న గీత సరిపోద?, ఈయన గారు క్రిష్ణ భగవానుడి వువాచ కె భాష్యం చెప్పె అంత ఘటికుడా అని నాలొ ఒక సందెహం. నాలాంటి భడుద్దాయిల సంగతి మన రచయిత కి బాగా యెరుక అనుకుంటా, తన ప్రయత్నం సాహసోపెతమని, గీత కు భాష్యం చెప్పడంలొ తన ఉద్దెశ్యం దాని గొప్పదనానికి లోటు వచ్చి కాదు, దానిని అర్థం చెసుకోలెని యాంత్రిక జీవితపు బానిసలకు (ఇంకెవరు నాలాంటి వాల్లు + మీలాంటి వాల్లు = మన లాంటి వాల్లు[ ఒక్కసారైన నిజం ఒప్పుకొండి]) ఈ పుస్తకం అని చెప్పి నన్ను ఒప్పించాడు. ఈ పుస్తకపు ముందు మాట ఒక ప్రముఖ సిని గెయ రచయిత చె వ్రాయబడింది. ఇందులొ ఉన్న అధ్యాయలన్ని చాలా ముఖ్యమైన సారాన్ని కలిగి ఉంటాయి, వాటి సారం చెప్పె సాహసం నెను చెయ్యను. ఇందులొ క్లుప్తంగ చెప్పడానికి వీలుకాదు, ప్రతి ఒక పదం ఎంతొ అనుభవ సారాన్ని మనకు భొదిస్తుంది, చిన్న చిన్న కథల రుపేణ మనకు భొదించె భాద్యతను భుజస్కందాల మీద వెసుకున్న రచయితకు ధన్యవాదాలు. పుస్తకం మొత్తం సారం చెప్పలెనందుకు క్షమించండి, ఒక సారి వీలయినపుడు మల్లి ఆ పుస్తకపు విషయాలను చర్చించుకుందాం,
సెలవు
మీ
రాజు

s.com. This is your first post. Edit or delete it and start blogging!

Follow

Get every new post delivered to your Inbox.